Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాలు... మాదాపూర్ ఎస్వోటీ పోలీసుల దాడులు

Madhapur SOT Police raids on Club Masti Pub
  • కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు
  • పరిమితికి మంచి డీజే సౌండ్స్
  • పరారీలో పబ్ యజమాని
హైదరాబాదులో క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ మస్తీ పబ్ లో కస్టమర్ల కోసం యువతులతో అర్ధనగ్న నృత్యాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు, పరిమితికి మించి డీజే సౌండ్లతో పబ్ నిర్వహిస్తున్న విషయం కూడా వెల్లడైంది. దాడుల సందర్భంగా 9 మంది యువతులు, పబ్ మేనేజర్ ప్రదీప్, డీజే ఆపరేటర్ ధనరాజ్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పబ్ యజమాని శివప్రసాద్ రెడ్డి, మేనేజర్లు కృష్ణ, విష్ణు పరారయ్యారు. దాడుల సందర్భంగా పోలీసులు క్లబ్ మస్తీ పబ్ లో డీజే మిక్సర్, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్నవారిని ఎస్వోటీ పోలీసులు కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించారు.
Club Masti Pub
Madhapur SOT Police
Raids
Women
Hyderabad

More Telugu News